గాంధీ జయంతి సందర్భంగా ఆరోగ్య శిబిరం
హైదరాబాద్, అక్టోబర్ 2)) మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఏవీ కాలేజీ మైదానంలో ఉచిత మెగా ఆరోగ్య శిబిరం ఏర్పాటైంది. లయన్స్ క్లబ్ సహకారంతో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ అండ్ లివర్ డిసీజెస్ ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరంలో వివిధ రకాల జీర్ణకోశ సమస్యలు, తదితర ఇబ్బందులకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగరం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున సీనియర్ సిటిజన్స్ తరలి వచ్చి, వైద్యపరీక్షలు చేయించుకొన్నారు.
ఈ సందర్భంగా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ అండ్ లివర్ డిసీజెస్ డైరక్టర్ డాక్టర్ ఆర్ వీ రాఘవేంద్రరావు మాట్లాడుతూ... మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ఈ ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మహాత్మాగాంధీ స్ఫూర్తితో ఈ విధమైన సేవ కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. జీర్ణకోశ సమస్యలు, ముఖ్యంగా లివర్, పాన్ క్రియాస్ సమస్యల పరిష్కారానికి ఆధునిక టెక్నాలజీ, నిపుణులతో కూడిన సేవల్ని తాము అందిస్తుటన్నట్లు వెల్లడించారు. దోమల్ గుడా, బంజారాహిల్స్ లలోని తమ రెండు కేంద్రాలలో జీర్ణకోశ సమస్యలకు ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏవీ కాలేజీ మైదానంలో ఏర్పాటుచేసిన వైద్య శిబిరంలో వందల సంఖ్యలో రోగులు... వైద్య పరీక్షలు చేయించుకొన్నారని డాక్టర్ రాఘవేంద్రరావు వివరించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ కు డాక్టర్ రాఘవేంద్రరావు ధన్యవాదాలు తెలిపారు.
Comments
Post a Comment